కుంబ్లే ఆల్‌టైమ్‌ రికార్డును బ్రేక్‌ చేసిన అశ్విన్‌

Feb 25,2024 16:56 #Ashwin, #Sports, #Yashaswi Jaiswal

రాంచీ : టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో కుంబ్లే ఆల్‌టైమ్‌ రికార్డును అశ్విన్‌ బ్రేక్‌ చేసి అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓలీ పోప్‌ను ఔట్‌ చేసిన అశ్విన్‌.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్‌ ఇప్పటివరకు భారత్‌ గడ్డపై టెస్టుల్లో 351 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే(350) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుంబ్లే ఆల్‌టైమ్‌ రికార్డును అశ్విన్‌ బ్రేక్‌ చేశాడు.

➡️