మస్కట్(ఒమన్): పురుషుల హాకీ ఆసియాకప్ జూనియర్ విభాగంలో భారత్ తొలి లీగ్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. గ్రూప్-ఎలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 11-0గోల్స్ తేడాతో థారులాండ్‌ను చిత్తుచేసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 8-0గోల్స్ ఆధిక్యతలో నిలిచింది. ఆరిజత్ సింగ్, గుర్జోత్ సింగ్, సౌరభ్ ఆనంద్ రెండేసి గోల్స్‌తో రాణించగా.. ఆర్ష్‌దీప్, శ్రద్ధానంద, దిల్‌రాజ్, రోహిత్, ముఖేశ్ ఒక్కో గోల్‌తో రాణించారు.