AUS Vs IND : ఆస్ట్రేలియాతో జరిగిన మూడో లేదా చివరి వన్డే మ్యాచ్ లో భారత మహిళా జట్టుకు 299 పరుగుల లక్ష్యం నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్లాండ్ (110) సెంచరీ సాధించగా, కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్ (56 లి), ఆష్లే గార్డెనర్ (50) అర్ధ శతకాలతో మెరిశారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4, దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ కైవసం చేసుకున్న విషయం విదితమే. టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లు ఫోయిబ్ లిచ్‌ఫీల్డ్ (25), జార్జియా వోల్ (26) దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించారు. ఈ సమయంలో విజఅంభించిన అరుంధతి రెడ్డి తొలి నలుగురు బ్యాటర్లను అవుట్ చేసింది. దీంతో ఒక్కసారిగా 78/4 స్కోరుకు ఆసీస్ పడిపోయింది. అయితే, ఆ తర్వాత భారత బౌలర్లు పట్టువదిలేశారు. గార్డెనర్‌తో కలిసి అన్నాబెల్ 96 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టింది. ఆ తర్వాత కెప్టెన్ తహ్లియా – అన్నాబెల్ జోడీ ఆరో వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. చివరి ఓవర్‌లో అన్నాబెల్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరింది. లేకపోతే మరోసారి ఆసీస్ 300 మార్క్‌ను తాకేది.