నేడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డ్రా

Jan 9,2025 06:09 #austelian open, #Sports, #Tennis
  • ప్రైజ్‌ మనీ భారీగా పెంపు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌ డ్రా గురువారం జరగనుంది. 2025 ఏడాదిలో తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ అయిన అయిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌.. మార్గరేట్‌ కోర్ట్‌ ఎరేనాలో జరగనుంది. తొలిరౌండ్‌ పోటీలో గెలిచిన విజేతకు 10పాయింట్లతోపాటు 132000 ఆస్ట్రేలియన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీ దక్కనుంది. ఈ క్రమంలోనే విజేతకు 2వేల పాయింట్లతోపాటు 3500000 ఆస్ట్రేలియన్‌ డాలర్లు దక్కనున్నాయి. మహిళల సింగిల్స్‌ విజేతకు కూడా అంతే మొత్తం అందుకోనున్నారు. ఇక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ నిర్వాహకులు ఈసారి ఆటగాళ్లకు అందజేసే ప్రైజ్‌ మనీని 12శాతం పెంపుదల చేశారు. ఈ టోర్నమెంట్‌కు భారత స్టార్‌ ఆటగాడు సుమిత్‌ నాగల్‌ నేరుగా అర్హత సాధించిన సంగతి తెలిసిందే. జనవరి 12నుంచి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ప్రారంభం కానుంది.

➡️