Australian Open : నాగల్‌ తొలిరౌండ్‌ ప్రత్యర్ధి మఛాక్‌

  • సిన్నర్‌, సబలెంకాకు టాప్‌సీడింగ్‌
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డ్రా విడుదల

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌ డ్రా విడుదలైంది. ఈసారి నేరుగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు అర్హత సాధించిన భారత సంచలనం సుమిత్‌ నాగల్‌ తొలిరౌండ్‌లో 26వ సీడ్‌, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన థోమస్‌ మఛాక్‌తో తలపడనున్నాయి. సుమిత్‌ 96వ ర్యాంక్‌ ఆటగాడు. తొలిరౌండ్‌ అడ్డంకిని దాటితో రెండోరౌండ్‌లో కఠిన ప్రత్యర్ధి, మూడోరౌండ్‌లో ఏకంగా 10సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన నొవాక్‌ జకోవిచ్‌తో తలపడాల్సి ఉంటుంది. ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో ఇటలీకి చెందిన సిన్నర్‌, బెలారస్‌కు చెందిన సబలెంకాకు టాప్‌సీడింగ్‌ దక్కాయి.

➡️