ముగిసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌.. భారత టార్గెట్‌ ఎంతంటే?

Feb 11,2024 17:22 #Cricket, #Sports

అండర్‌-19 వరల్డ్‌ కప్‌ లో నేడు భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసి భారత్‌ టార్గేట్‌ 254 పరుగులుగా నిర్దేశించారు. ఈ మ్యాచ్‌ లో మొదట టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. హ్యారీ డిక్సన్‌ 42, హ్యూ వీబ్‌జెన్‌ 48, హర్జాస్‌ సింగ్‌ 55, ర్యాన్‌ హిక్స్‌ 20, ఆలివర్‌ పీక్‌ 46, పరుగులు చేశారు. శాన్‌ కాన్స్టాన్స్‌ (0), రాఫ్‌ మాక్‌మిల్లన్‌ (2) , చార్లీ ఆండర్సన్‌ (13), టామ్‌ స్ట్రాకర్‌ (7) అంతగా రాణించలేదు. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి.. 253 పరుగులు చేసింది. భారత బౌలర్లు..రాజ్‌ లింబానీ 3, నమన్‌ తివారీ 2, సౌమీ పాండే, ముషీర్‌ ఖాన్‌, చెరో వికెట్‌ పడగొట్టారు.

➡️