ఆస్ట్రేలియాకు షాక్‌.. కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌, హాజిల్‌వుడ్‌ దూరం

టీమిండియాపై సిరీస్‌ విజయంతో జోష్‌ మీద ఉన్న ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ గాయం కారణంగా లంక పర్యటనకు దూరమయ్యాడు. ఇటీవల భారత్‌తో జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన హాజిల్‌వుడ్‌ ప్రస్తుతం.. ప్రక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అందుబాటులో ఉండడని జట్టు వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సిరీస్‌కు ఆసీస్‌ రెగ్యూలర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ కూడా దూరం కానున్నట్లు సమాచారం.

➡️