ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబారు వేదికగా భారత్ – న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు నెట్టింట టాస్‌పై గందరగోళం నెలకొంది. దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు రవీచంద్ర ఆశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. భారత్ మాత్రం ఫైనల్‌లో టాస్ గెలవాల్సిన అవసరం లేదన్నాడు. ‘నా అభిప్రాయం ప్రకారం భారత్ ఈసారి కూడా టాస్ గెలవకుండా ఉంటేనే బాగుంటది.. కివీస్‌కే ఏది ఎంచుకోవాలో వాళ్ల ఇష్టం.. అప్పుడు భారత్‌ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసే ఛాన్స్ లేకపోలేదు.. కానీ, భారత్ ఇప్పటి వరకు ఈ ట్రోఫీలో టాస్ ఓడిపోయినప్పుడు లక్ష్య ఛేదనకు దిగినా.. తొలుత బ్యాటింగ్ చేసినా గెలిచింది.. ఈసారి కూడా టీమిండియా విజయం సాధిస్తుంది..” అని పేర్కొన్నాడు. కాగా ఇప్పటి వరకు వరుసగా 14 వన్డేల్లో భారత్ టాస్ కోల్పోగా.. అందులో రోహిత్ శర్మ 11 సార్లు టాస్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
