ఆయూబ్‌ సెంచరీ

Nov 26,2024 22:09 #Cricket, #Pakistan, #Sports, #Zimbabwe
  • రెండో వన్డేలో జింబాబ్వేపై పాకిస్తాన్‌ ఘన విజయం

బులవాయో(జింబాబ్వే): జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్‌ జట్టు ఘన విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 146పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్‌ ఓపెనర్‌ సైబ్‌ ఆయూబ్‌(113), షఫీక్‌(32) వికెట్‌ చేజార్చుకోకుండా మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు పాకిస్తాన్‌ పేసర్లు ఆబ్రార్‌ అహ్మద్‌(4/33), అఘా సల్మాన్‌(3/26) రాణించడంతో జింబాబ్వే జట్టు 32.3ఓవర్లలో 145పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే జట్టులో మయర్స్‌(33), విలియమ్స్‌(31), సికిందర్‌ రాజా(17), బెన్నెట్‌(14) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్‌ జట్టు 18.2ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఆయుబ్‌కు లభించగా.. మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. మూడో, చివరి వన్డే గురువారం జరగనుంది.

➡️