T20 World Cup: శ్రీలంక‌పై బంగ్లాదేశ్ గెలుపు

Jun 8,2024 17:26 #Cricket, #Sports, #T20 world cup

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీలంక‌కు ఘెర ప‌రాభ‌వం ఎదురైంది. డ‌ల్లాస్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఆ జ‌ట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మి పాలైంది. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 124 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ నిస్సాంక 47 ర‌న్స్‌తో రాణించ‌గా, ధ‌నుంజ‌య 21, డిసిల్వా 19 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించారు. మిగ‌తా బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. బంగ్లా బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్‌, రిష‌ద్ హుస్సేన్ చెరో 3 వికెట్లు తీశారు.అనంత‌రం 125 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన బంగ్లాదేశ్ 19 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. హృదోయ్ 40, లిట‌ర్ దాస్ 36 బంగ్లాదేశ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో నువాన్ తుషార 4, హస‌రంగ 2 వికెట్లు తీశారు.

➡️