BCCI alert.. ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచన

Apr 16,2025 18:12 #betting, #Cricket, #IPL 2025, #Sports

ఐపీఎల్‌ 2025 జట్ల ఓనర్లకు, ఆటగాళ్లను బీసీసీఐ బిగ్‌ అలర్ట్‌ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపారి ఐపీఎల్‌ జట్ల ఓనర్లను, ప్లేయర్లను, కోచ్‌ లను, కామెంటేటర్లను, సిబ్బందిని ఫిక్సింగ్‌లోకి దించే పనిలో పడ్డారని.. అన్ని జట్లు, ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అతడికి అనేకమంది బుకీలతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించినట్టు, ఏ జట్టు ఓనర్లనైనా.. ఆటగాళ్లనైనా అతడు సంప్రదిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్లు క్రిక్‌ బజ్‌ వార్తా కథనాలు వెలువరించింది.

➡️