బెంగళూరు: భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) అపెక్స్ కౌన్సిల్ సమావేశం బుధవారం జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో బిసిసిఐ మాజీ కార్యదర్శి జై షా స్థానంలో కొత్త కార్యదర్శి నియామకం అంశం చేర్చకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులో జరిగే బోర్డు 93వ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు జరగనున్న చివరి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇదే. ఐసిసి చైర్మన్‌గా జై షా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 1న ఆయన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎజిఎంలో బిసిసిఐ కార్యదర్శిగా పూర్తిస్థాయి బాధ్యతల నుంచి జై షా బాధ్యతల నుంచి వైదొలగనప్పటికీ.. నామినేషన్ ప్రక్రియపై చర్చించే అంశాన్ని జెండాలో చర్చలేదు.
