ఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కాంస్య పతక విజేత, భారతదేశం గర్వించదగ్గ స్టార్ బజరంగ్ పునియాపై నాలుగేళ్ల నిషేధం పడింది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఈ నిషేధాన్ని విధించింది. డోపింగ్ పరీక్షకు నిరాకరించి శాంపిల్ ఇవ్వకపోవడంతో ఈ చర్య తీసుకున్నారని తెలిపింది.అయితే, పరీక్ష కోసం గడువు ముగిసిన కిట్‌లను ఇచ్చినందున నమూనాను అందజేయలేదని, పరీక్షకు సిద్ధంగా ఉన్నానని పునియా ‘నాడా’కు తెలియజేశారు. నిషేధ కాలంలో పునియా కుస్తీ పోటీల్లో పాల్గొనడం లేదా కోచ్‌గా మారడం సాధ్యం కాదు. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ముందు వరుసలో ఉన్న ఆటగాళ్లలో పునియా ఒకరు.