డేవిస్‌ కప్‌లో శుభారంభం

Feb 1,2025 22:40 #Davis Cup, #India, #Tennis
  • టోగోపై 2-0 ఆధిక్యతలో భారత్‌

న్యూఢిల్లీ: డేవిస్‌ కప్‌ గ్రూప్‌-1 ప్లేఆఫ్‌లో భారత్‌ శుభారంభం చేసింది. టోగోతో శనివారం జరిగిన రెండు సింగిల్స్‌ మ్యాచుల్లోనూ గెలిచి భారత్‌ 2-0 ఆధిక్యతలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో శశికుమార్‌ ముకుంద్‌, రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌ విరుససెట్లలో టోగో ప్లేయర్లను చిత్తుచేశారు. ముకుంద్‌ 6-2, 6-1తో లోవో అయోటేను చిత్తుచేయగా.. రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ 6-0, 6-2తో థామస్‌ సెటోడ్జిని ఓడించాడు. ఈ మ్యాచ్‌ కేవలం 50నిమిషాల్లోనే ముగిసింది. ఆదివారం జరిగే డబుల్స్‌ పోటీలో శ్రీరామ్‌ బాలాజీ-రిత్విక్‌ చౌదరి బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ డేవిస్‌ కప్‌ గ్రూప్‌-2 రెండో దశకు చేరుకోనుంది.

➡️