టి20 ప్రపంచకప్‌కు బెన్‌ స్టోక్స్‌ దూరం

Apr 2,2024 23:46 #Sports

లండన్‌: టి20 ప్రపంచ కప్‌కు ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌ నుంచి స్వచ్చందంగా తప్పుకుంటున్నట్టు మంగళవారం ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డులు వెల్లడించాయి. మోకాలి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోవడంతో పాటు బౌలింగ్‌పై దృష్టి పెట్టేందుకు స్టోక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2022లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ జట్టు రెండోసారి టి20 ప్రపంచకప్‌ విజేతగా అవతరించింది. గాయం నుంచి కోలుకున్న స్టోక్స్‌ వన్డేలు, టి20లకే ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించుకోగా.. మోకాలి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోవడం కోసం టి20 ప్రపంచకప్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. 2024 జూన్‌ 1నుంచి టి20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది. ఈసారి అమెరికా, వెస్టిండీస్‌లు మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.

➡️