బెంగళూరు సునాయాసంగా..

Feb 18,2025 00:23 #Cricket, #rcb womens, #Sports
  • మెరిసిన మంధాన
  • బౌలింగ్‌లో రేణుక, వారేహామ్‌
  • ఢిల్లీపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు

వడోధర: మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సిబి) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై నెగ్గిన బెంగళూరు.. సోమవారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 19.3ఓవర్లలో 141పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆ లక్ష్యాన్ని స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు జట్టు 16.2ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ మంధాన (81; 47బంతుల్లో 10ఫోర్లు, 3సిక్సర్లు) ధనా ధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగింది.
అంతకుముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు రేణుకా సింగ్‌, వారేహామ్‌కి తోడు కిమ్‌ గార్త్‌, ఏక్తా బిస్ట్‌ కట్టడిగా బౌలింగ్‌ చేయడంతో ఢిల్లీ జట్టు 141పరుగులకే పరిమితం చేశారు. టాస్‌ గెలిచిన బెంగళూరు కెప్టెన్‌ స్మృతి మంధాన తొలుత బౌలింగ్‌కే మొగ్గు చూపింది. కెప్టెన్‌ నమ్మకాన్ని బెంగళూరు బౌలర్లు వమ్ము చేయలేదు. రేణుకా సింగ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఫామ్‌లో ఉన్న షఫాలీ వర్మను ఔట్‌ చేసి ఢిల్లీకి షాకిచ్చింది. ఆ తర్వాత కెప్టెన్‌ లానింగ్‌, రోడ్రిగ్స్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ లానింగ్‌(17), రోడ్రిగ్స్‌ ఔటయ్యాక ఢిల్లీ వికెట్ల పతనం మొదలైంది. రేణుక(3/23), వారేహామ్‌(3/25), గార్త్‌(2/19), ఏక్తా(2/35) సమిష్టిగా చెలరేగారు. ఢిల్లీ ఓపెనర్‌, కెప్టెన్‌ లానింగ్‌(17), షెఫాలీ వర్మ(0) తక్కువ పరుగులకే పెవీలియన్‌కు చేరారు. ఢిల్లీ బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్‌(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సారా బ్రైస్‌(23), అన్నాబెల్‌ సదర్లాండ్‌(19) రాణించారు. సథర్లాండ్‌(19), కాప్‌(12), జొన్నాసెన్‌(1), బ్రౌస్‌(23), శిఖా పాండే(19) భారీస్కోర్లు చేయలేకపోయారు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు రాధా యాదవ్‌(0), అరుంధతి రెడ్డి(4) ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. దీంతో ఢిల్లీ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు కెప్టెన్‌ మంధాన(81), వాట్‌(42) తొలి వికెట్‌కు 107పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఔటయ్యాక పెర్రీ(7), రీచా ఘోష్‌(11) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ఢిల్లీ బౌలర్లు శిఖా పాండే, అరుంధతి రెడ్డికి ఒక్కో వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు…
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: లానింగ్‌ (సి)పెర్రీ (బి)గార్త్‌ 17, షెఫాలీ (సి)మంధాన (బి)రేణుక 0, రోడ్రిగ్స్‌ (స్టంప్‌)రీచా (బి)వారేహామ్‌ 34, సథర్లాండ్‌ (సి)మంధాన (బి)రేణుక 19, కాప్‌ (సి)హోడ్జే (బి)ఏక్తా 12, జొన్నాసెన్‌ (సి)కనిక (బి)ఏక్తా 1, బ్రైస్‌ (స్టంప్‌)రీచా (బి)వారేహామ్‌ 23, శిఖా పాండే (సి)ఏక్తా (బి)రేణుక 14, రాధా (సి అండ్‌ బి)వారేహామ్‌ 0, అరుంధతి రెడ్డి (సి)ఎలైసే పెర్రీ (బి)గార్త్‌ 4, మిన్ను మణి (నాటౌట్‌) 5, అదనం 12. (19.3 ఓవర్లలో ఆలౌట్‌) 141పరుగులు.

వికెట్ల పతనం: 1/1, 2/60, 3/62, 4/84, 5/87, 6/105, 7/130, 8/130, 9/132, 10/141

బౌలింగ్‌: రేణుకా సింగ్‌ 4-0-23-3, గార్త్‌ 3.3-0-19-2, ఏక్తా బిస్ట్‌ 4-0-35-2, జోషిత 2-0-21-0, వారేహామ్‌ 4-0-25-3, కనిక అహుజ 2-0-13-0.
రాయల్‌ ఛాలెంజర్స్‌

బెంగళూరు మహిళల ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (సి)అరుంధతి రెడ్డి (బి)శిఖా పాండే 81, వాట్‌ (సి)రోడ్రిగ్స్‌ (బి)అరుంధతి రెడ్డి 42, ఎలైసె పెర్రి (నాటౌట్‌) 7, రీచా ఘోష్‌ (నాటౌట్‌) 11, అదనం 9. (16.2ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 146పరుగులు.

వికెట్ల పతనం: 1/107, 2/133

బౌలింగ్‌: కాప్‌ 2-0-27-0, శిఖా పాండే 4-0-27-1, మిన్ను మణి 1-0-10-0, అరుంధతి రెడ్డి 3.2-0-25-1, జొన్నాసెన్‌ 4-0-37-0, సథర్లాండ్‌ 2-0-18-0.

➡️