యుఎఫ్‌సిలో బీజూజా తోమర్‌ గెలుపు

Jun 9,2024 23:27 #Boxing, #Sports
  • తొలి ఇండియన్‌గా రికార్డు

కెంటుకీ : అమెరికాలో జరిగే అల్టిమేట్‌ ఫైటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ (యుఎఫ్‌సి)లో భారత్‌కు చెందిన పూజా తోమర్‌ ఒక బౌట్‌లో విజయం సాధించింది. దీంతో యుఎఫ్‌సిలో విజయం సాధించిన తొలి భారత వ్యక్తిగా రికార్డు సృష్టించింది. స్ట్రా-వెయిట్‌ (52 కేజీలు) విభాగంలో బ్రెజిల్‌కు చెందిన రేయాన్‌ డాస్‌ శాంటోస్‌పై 30-27, 27-30, 29-28 పాయింట్లతో తోమార్‌ విజయం సాధించింది. విజయం అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ విజయం తన విజయం మాత్రమే కాదని, భారత అభిమానులందరిదీ, భారత యోధులందరదీ అని అన్నారు. ‘భారత ఫైటర్లు ఇక్కడ రాణించలేని అనుకునే వారందరికీ నేను ఇక్కడ గెలిచి భారత ఫైటర్లు ఓడిపోయేవారు కాదని ప్రపంచానికి చూపిం చాలని మాత్రమే నేను అనుకున్నాను’ అని అన్నారు. 30 ఏళ్ల పూజా తోమర్‌ గత ఏడాది అక్టోబర్‌లో యుఎఫ్‌సితో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో అతి పెద్ద మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రమోషన్‌లో పోటీ పడిన తొలి భారత మహిళగా నిలిచారు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలోని బుధనా గ్రామంలో పూజా జన్మించారు. ఐదు సార్లు జాతీయ వుషు ఛాంపియన్‌గా నిలిచారు.

➡️