Border Gavaskar Trophy: బ్యాటర్ల వైఫల్యం

ఇండియా 180ఆలౌట్‌
ఆస్ట్రేలియా 86/1
పింక్‌బాల్‌ టెస్ట్‌

అడిలైడ్‌: పింక్‌ బాల్‌ డే/నైట్‌ టెస్టులో తొలిరోజు మరోసారి భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగింది. పెర్త్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. అడిలైడ్‌ వేదికగా జరిగిన రెండోటెస్ట్‌లో తొలిరోజు కేవలం 180పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇంకా 96పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్‌ బ్యాటర్లలో ఖవాజా(13) ఔటయ్యాడు. ఖవాజాను బుమ్రా ఔట్‌చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి నాథన్‌ మెక్‌స్వీనే(38), లబూషేన్‌(20) క్రీజ్‌లో ఉన్నారు. అడిలైడ్‌ స్టేడియంలో రెండుసార్లు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో కొంతసేపు మ్యాచ్‌ను నిలిపివేశారు. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు.. ఆసీస్‌ పేసర్లు గట్టి షాక్‌ ఇచ్చారు. వరుసగా వికెట్లను పడగొట్టారు. తొలి సెషన్‌లో 82 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోగా, రెండో సెషన్‌లో 98 పరుగులు చేసి మిగిలిన ఆరు వికెట్లను కోల్పోయింది. తొలిసెషన్‌ ఇండియా. కేవలం 44.1 ఓవర్లలో 180 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఇరగదీశాడు. భారత్‌తో అడిలైడ్‌లో జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టులో కెరీర్‌ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఇండియా తన ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో అయితే స్టార్క్‌ 48 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

18బంతుల్లో 3వికెట్లు..
టీమిండియా లంచ్‌ విరామానికి ముందు చివరి 18బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయింది. కెఎల్‌ రాహుల్‌, గిల్‌, కోహ్లి వికెట్లను చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికి జైస్వాల్‌ ఔట్‌ కాగా.. 2వ వికెట్‌కు కెఎల్‌ రాహుల్‌-గిల్‌ 69పరుగులు జతచేశారు. ఈ జోడీని స్టార్క్‌ విడదీశాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. అయితే 18.4వ ఓవర్‌లో రాహుల్‌ను మిచెల్‌ స్టార్క్‌ ఔట్‌ చేశాడు. 8 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. 7 పరుగులు చేసి స్టార్క్‌ (20.1 ఓవర్‌) బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో గిల్‌ (51 బంతుల్లో 31 పరుగుల) కూడా ఔటయ్యాడు. దీంతో 3 ఓవర్ల వ్యవధిలోనే ముగ్గురు టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. స్టార్క్‌(6/48) కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌ నమోదు చేశాడు.

మళ్లీ మెరిసిన నితీశ్‌
పింక్‌ బాల్‌ టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి(42) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ దెబ్బకు భారత స్టార్‌ బ్యాటర్లు తడబడ్డా.. నితీశ్‌ చివరి వరకు క్రీజ్‌లో నిలిచి భారత్‌ గౌరవప్రద స్కోర్‌కు దోహదపడ్డాడు. 109 పరుగుల వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌(21) ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్‌.. 54బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో 42పరుగులు చేశాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్ల సాయంతో జట్టు స్కోర్‌ను 180పరుగులకు చేర్చి చివరి వికెట్‌గా పెవీలియన్‌కు చేరాడు.

పింక్‌బాల్‌ టెస్ట్‌కు రికార్డుస్థాయిలో అభిమానులు
అడిలైడ్‌ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమైన డే అండ్‌ నైట్‌ టెస్ట్‌కు రికార్డుస్థాయిలో అభిమానులు హాజరయ్యారు. తొలిరోజు ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సుమారు 36,255మంది ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో 12ఏళ్ల క్రితం నమోదైన 36,000 (పింక్‌బాల్‌ టెస్ట్‌) రికార్డు బ్రేక్‌ అయ్యింది. అలాగే భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్‌ను అత్యధికంగా 2011-12 లో 35,081 ప్రేక్షకులు వీక్షించగా.. తాజాగా ఆ రికార్డు కూడా బ్రద్దలైంది.

స్కోర్‌బోర్డు…
ఇండియా తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (ఎల్‌బి)స్టార్క్‌ 0, కెఎల్‌ రాహుల్‌ (సి)స్వీనే (బి)స్టార్క్‌ 37, గిల్‌ (ఎల్‌బి)బోలండ్‌ 31, కోహ్లి (సి)స్మిత్‌ (బి)స్టార్క్‌ 7, పంత్‌ (సి)లబూషేన్‌ (బి)కమిన్స్‌ 21, రోహిత్‌ (ఎల్‌బి)బోలండ్‌ 3, నితీశ్‌రెడ్డి (సి)హెడ్‌ (బి)స్టార్క్‌ 42, అశ్విన్‌ (ఎల్‌బి)స్టార్క్‌ 22, హర్షిత్‌ రాణా (బి)స్టార్క్‌ 0, బుమ్రా (సి)ఖవాజా (బి)కమిన్స్‌ 0, సిరాజ్‌ (నాటౌట్‌) 4, అదనం 13. (44.1 ఓవర్లలో ఆలౌట్‌) 180పరుగులు. వికెట్ల పతనం: 1/0, 2/69, 3/77, 4/81, 5/87, 6/109, 7/141, 8/141, 9/176, 10/180 బౌలింగ్‌: స్టార్క్‌ 14.1-2-48-6, కమిన్స్‌ 12-4-41-2, బోలండ్‌ 13-0-54-2, లియాన్‌ 1-0-6-0, మిఛెల్‌ మార్ష్‌ 4-0-26-0.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: ఖవాజా (సి)రోహిత్‌ (బి)బుమ్రా 13, స్వీనే (బ్యాటింగ్‌ 38, లబూషేన్‌ (బ్యాటింగ్‌) 20, అదనం 15. (33ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 86పరుగులు.
వికెట్ల పతనం: 1/24 బౌలింగ్‌: బుమ్రా 11-4-13-1, సిరాజ్‌ 10-3-29-0, హర్షిత్‌ రాణా 8-2-18-0, నితీశ్‌ రెడ్డి 3-1-12-0, అశ్విన్‌ 1-1-0-0.

 

➡️