శ్రీలంకపై గెలుపుతో ఫైనల్‌కు యువ భారత్
8న బంగ్లాదేశ్‌తో టైటిల్ పోరు
షార్జా: ఆసియా కప్(అండర్-19) ఫైనల్లోకి యువ భారత్ దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు చేతన్ శర్మ(3/34), కిరణ్ చోర్మలే(2/32), ఆయుశ్ మాత్రే(2/37), యుధజిత్ గుహా(1/19), హార్దిక్ రాజ్(1/30) కట్టడి చేశాడు. దీంతో శ్రీలంక జట్టు 46.2 ఓవర్లలో 173 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో లక్విన్ అభరుసింఘే (69) టాప్ స్కోరర్. 174 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత యువ జట్టును వైభవ్ సూర్యవంశీ (67; 36 బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 21.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే(34), ఆండ్రీ సిద్దార్థ్(22), కెప్టెన్ మొహమ్మద్ అమాన్(25 నాటౌట్), కేపీ కార్తికేయ(11) రాణించారు. లంక బౌలర్లలో విహాస్ తేవ్మిక, విరన్ చముదిత, ప్రవీణ్ మనీషా తలో వికెట్ పడగొట్టారు. ఇటీవల జరిగిన ఐపిఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 1.10 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఐపిఎల్ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్య వంశీ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం సూర్యవంశీ వయసు 13 ఏళ్లు.
పాక్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్
అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై 7వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్‌ను ఢకొీంటుంది.
Border Gavaskar Trophy – టీ బ్రేక్ సమయానికి భారత్ 4 వికెట్లు డౌన్