- నాల్గో వన్డేలో ఆస్ట్రేలియాపై 186పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం
లార్డ్స్: వేదికగా జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ జట్టు 186 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించడం ఈ మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 5వికెట్ల నష్టానికి 312పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్(87), లియాన్ లివింగ్‌స్టోన్(62నాటౌట్), డకెట్(63) అర్ధ సెంచరీలతో మెరిసారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా(2/66), హేజిల్‌వుడ్(1/40), మాక్స్‌వెల్(1/30), మిచెల్ మార్ష్(1/26) రాణించారు. ఛేదనలో ఆసీస్ 24.4 ఓవర్లలో కేవలం 126 పరుగులకే కుప్పకూలింది. తొలి వికెట్‌కు ట్రావిస్ హెడ్(34), మిచెల్ మార్ష్(28) 68 పరుగులు జోడించినా.. ఆసీస్‌కు కష్టాలు తప్పలేదు. ఆస్ట్రేలియా కేవలం 58 పరుగుల వ్యవధిలోనే పది వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఇంగ్లండ్ బౌలర్లలో మ్యాథ్యూ పాట్ (4/38), జోఫ్రా ఆర్చర్ (2/33), కార్సే (3/36), అదిల్ రషీద్ (1/11) రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హ్యారీ బ్రూక్ సొంతం చేసుకున్నాడు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు 2-2 సమంగా ఉండగా.. ఐదో, చివరి వన్డే ఆదివారం జరగనుంది.