ఐసిసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ రేసులో బుమ్రా

Jan 7,2025 23:45 #Bumrah, #icc, #Player of the Month, #race

టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఐసిసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు రేసులో నిలిచాడు. డిసెంబర్‌-2024 నెలకు గాను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్ల జాబితాను వెల్లడించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో 31ఏళ్ల బుమ్రా 14.22 సగటుతో 32వికెట్లు తీసాడు. తొలి మూడు టెస్ట్‌లు ముగిసేసరికి బుమ్రా 22 వికెట్లతో సత్తా చాటాడు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ను టీమిండియా 1-3తో చేజార్చుకొని డబ్ల్యుటిసి 2025 ఫైనల్‌కు చేరడంలో విఫలమైన సంగతి తెలిసిందే. బుమ్రాతోపాటు ఐసిసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ రేసులో పాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా, డేన్‌ పీటర్సన్‌(దక్షిణాఫ్రికా) కూడా ఉన్నారు.

➡️