Bumrah – వెన్ను గాయంతో స్టార్‌ పేసర్‌ బుమ్రా – ఛాంపియన్స్‌ ట్రోఫీ లో ఆడతారా ?

క్రీడలు : ఫిబ్రవరి నెల 19వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఈ క్రమంలో టీమిండియాకు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ మెగా టోర్నీకి మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే భారత్‌కు అది గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.

వెన్నునొప్పి కారణంగా ….
బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా … సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌కు దూరంగా ఉన్నారు. వెన్నునొప్పితో అతడు బాధపడుతున్నట్లు సమాచారం. వర్క్‌లోడ్‌ పెరగడం వల్ల అతడు ఒత్తిడికి గురైనట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ వైద్య బఅందం బుమ్రాకు విశ్రాంతి అవసరం అని సూచించింది. ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దూరం అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వెన్నునొప్పి కారణంగా బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేయలేదు. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో కాస్త ఆసౌక్యరంగా కన్పించినప్పటికీ బుమ్రాను వెంటనే స్కానింగ్‌ కు తరలించారు. అయితే ఇప్పటివరకు బుమ్రా వెన్ను గాయం ఏ దశలో ఉందన్నది బీసీసీఐ గానీ టీమ్‌మెనెజ్‌మెంట్‌ కానీ క్లారిటీ ఇవ్వలేదు. అతడు మైదానంలో అడుగుపెట్టాలంటే ఏన్సీఎ వైద్య బఅందం క్లియరెన్స్‌ కచ్చితంగా కావాలి.

రేపు భారత్‌కు …
జస్ప్రీత్‌ బుమ్రా ఆస్ట్రేలియా నుంచి గురువారం భారత్‌కు చేరుకోనున్నారు. స్వదేశానికి వచ్చాక గతం (2022)లో న్యూజిలాండ్‌లో తనకి శస్త్ర చికిత్స చేసిన వైద్యుడిని సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్టార్‌ పేసర్‌ ఏన్సీలో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నట్లు సమాచారం.

➡️