‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డు గెలిచిన బుమ్రా

డిసెంబర్‌ 2024 నెలలో ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ విజేతను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ మంగళవారం ప్రకటించింది. భారత స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా పురుషుల విభాగంలో బెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ డేన్‌ ప్యాటర్సన్‌లను ఓడించి బుమ్రా ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డును బుమ్రా రెండోసారి గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో బుమ్రా మొత్తం 32 వికెట్లు తీశాడు. దీంతో.. బుమ్రా ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు.

➡️