- ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
నింగ్బో(చైనా): ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ సింగిల్స్‌లో భారత షట్లర్ల పోరాటం ముగియగా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల-తానీసా కాస్ట్రో క్వార్టర్స్‌కు చేరారు. ప్రి క్వార్టర్స్‌కు చేరిన కిరణ్ జార్జి, ప్రియాన్షు రాజ్‌వత్‌తోపాటు పివి సింధు కూడా ఓటమిపాలైంది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్‌ఫైనల్లో ప్రియాన్షు 14-21, 17-21తో నరాకో(జపాన్) చేతిలో, కిరణ్ జార్జి 21-19, 13-21, 16-21తో విటిద్‌శరమ్(థారులాండ్) చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు 11-21, 21-16, 16-21తో టాప్‌సీడ్ యమగుచి(జపాన్) చేతిలో పోరాడి ఓటమిపాలైంది. ఇక పురుషుల డబుల్స్‌లో రేతినసబాపతి-అంసక్రూనమ్ జోడీ 15-21, 14-21తో, మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రభుదేశ్-సూర్యా జంట 11-21, 14-21తో చైనా షట్లర్ల చేతిలో పరాజయాన్ని చవిచూశారు. ఇక తానీసా కాస్ట్రో-దృవ్ కపిల జంట క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ధృవ్ కపిల-కాస్టో జంట 12-21, 21-16, 21-18తో చైనీస్ తైపీ షట్లర్లపై గెలిచి క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు.