హ్యాండ్‌ బాల్‌ జాతీయ స్థాయిలో చాగల్లు జడ్పీహెచ్‌ విద్యార్థులు

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : జాతీయ స్థాయి అండర్‌ 19 ఎస్జిఎఫ్‌ హ్యాండ్‌ బాల్‌ పోటీలకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చాగల్లు విద్యార్థిని ఎంపికయ్యింది. నవంబర్‌ 9, 10, 11 తేదీలలో కడప జిల్లాలో జరిగిన అండర్‌ 19 హ్యాండ్బల్‌ పోటీలలో చాగల్లు విద్యార్థులు జి జాహ్నవి. దేవి పాల్గొని తృతీయ స్థానం సంపాదించి జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికైనట్లు పి.డి విజయలక్ష్మి తెలిపారు. ఈ జాతీయ స్థాయి పోటీలు 11 నుండి 15 తేదీ వరకు పంజాబీ రాష్ట్రంలోని లుధియానాలో జరగనున్నాయని పి.డి విజయలక్ష్మి తెలిపారు. సోమవారం 9. 18 కాజీపేటలో జాహ్నవి దేవి రిపోర్ట్‌ చేయాలని పిఎఫ్‌ రాష్ట్ర ఆఫీసు నుండి ఫోన్‌ చేశారని పిడి విజయలక్ష్మి తెలిపారు. జి.జాహ్నవి దేవి ఎంపిక పట్ల హెచ్‌ఎం మురళికృష్ణ ఎస్‌ఎంసి చైర్మన్‌ గోపాలకృష్ణ విద్యార్థులు గ్రామస్తులు ఉపాధ్యాయులు జాహ్నవి దేని అభినందించారు. విద్యార్థులు ఇంతవరకు హ్యాండ్‌ బాలలో ఎవరూ కూడా జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనలేదని తెలిపారు. ఇదే మొదటిసారి అని తెలిపారు. ఎండి నఫీజ్‌ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశారు.

➡️