జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు చాగల్లు విద్యార్థిని ఎంపిక

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : జాతీయ స్థాయి ఫుట్‌ బాల్‌ పోటీలకు చాగల్లు జడ్‌పిటిసి విద్యార్థిని ఎంపికయ్యింది. జాతీయస్థాయి అండర్‌ 14 ఫుట్బాల్‌ పోటీలకు చాగల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని సెప్టెంబర్‌ 25 నుండి 26వ తేదీ వరకు అనంతపురం జిల్లా హిందూపూర్‌ లో ఎస్జిఎఫ్‌ అండర్‌ 14 ఇయర్స్‌ ఫుట్బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలలో జడ్పీహెచ్‌ఎస్‌ చాగల్లు విద్యార్థిని ఆర్‌ ప్రవల్లిక పాల్గొని ఫోర్త్‌ ప్లేస్‌ సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని పిడి విజయలక్ష్మి తెలిపారు. ఇంతవరకు చాగల్లు హైస్కూల్‌ నుండి బాలికల ఫుట్బాల్‌ జాతీస్తాయి పోటీలకు ఎవరూ కూడా ఎంపిక కాలేదని ఇదే మొదటి సారి అని పి డి. జె విజయలక్ష్మి తెలిపారు. ఆర్‌ ప్రవల్లిక ఎంపిక పట్ల ఇన్చార్జ్‌ హెచ్‌ఎం ఆర్వి ప్రసాద్‌ పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ గోపాలకృష్ణ గ్రామస్తులు ఉపాధ్యాయ సిబ్బంది ప్రవల్లికను అభినందించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ప్రవల్లికను ఎండి నఫీజ్‌ ఆర్థికంగా సహాయం చేశారు.

➡️