చాంపియన్‌ కార్ల్‌సన్‌

Jun 8,2024 22:21 #chess, #Sports
  • విజయంతో ముగించిన ప్రజ్ఞానంద

చెన్నై: నార్వే చెస్‌ టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద విజయంతో ముగించాడు. శనివారం జరిగిన 10వ, ఆఖరి రౌండ్‌లో జపాన్‌ ఆటగాడు హికరు నకమురాను ఓడించాడు. రెండో స్థానం కోసం జరిగిన పోరులో ప్రజ్ఞానందకు నకుముర గట్టి పోటీనిచ్చాడు. అయితే.. టై బ్రేక్‌లో భారత స్టార్‌ ప్రత్యర్థికి చెక్‌ పెట్టాడు. అయినప్పటికీ ప్రజ్ఞానంద మూడో స్థానంతో సరిపెట్టుకోల్సి వచ్చింది. నార్వే వేదికగా జరిగిన ఈ టోర్నీలో వరల్డ్‌ నంబర్‌ మాగస్‌ కార్ల్‌సన్‌ విజేతగా నిలిచాడు. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఫాబియానో కరౌనాలు పోటాపోటీగా తలపడ్డారు. చివరకు మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో టై బ్రేకర్‌ ఆధారంగా విజేతను నిర్ణయించారు. దాంతో, కార్ల్‌సన్‌ ఆరోసారి నార్వే చెస్‌ ట్రోఫీ చాంపియన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇక మహిళల విభాగంలో జు వెంజున్‌ చాంపియన్‌గా అవతరించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ప్రజ్ఞానంద సోదరి ఆర్‌ వైశాలి నాలుగో స్థానానికే పరిమితమైంది.

➡️