చాంపియన్స్ ట్రోఫీకి క్రికెట్ ఆస్ట్రేలియా(సిఎ) కూడా జట్టును ప్రకటించింది. 15మంది సభ్యులతో కూడిన జట్టు కెప్టెన్‌గా పాట్ కమ్మిన్స్ ఎంపికయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడ్డ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌కు సైతం జట్టులో చోటు దక్కింది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్, మెక్‌గర్న్‌కు సైతం జట్టులో చోటు దక్కింది. పాక్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పేలవమైన ఫామ్‌తో జాతీయ జట్టుకు దూరం కాగా.. మళ్లీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ఆల్‌రౌండర్లు, ఫాస్ట్ బౌలర్లతో పాటు స్టార్ బ్యాటర్స్‌తో జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిల్ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్, వెస్టిండ్ సిరీస్, ఇంగ్లండ్ పర్యటనలో విజయవంతమైన జట్లని తెలిపారు.
ఆస్ట్రేలియా జట్టు: కమ్మిన్స్(కెప్టెన్), క్యారీ(వికెట్ కీపర్), ఎల్లిస్, హార్డీ, హేజిల్‌వుడ్, హెడ్, ఇంగ్లిస్, లబూషేన్, మార్ష్, మాక్స్‌వెల్, షార్ట్, స్మిత్, జంపా, స్టొయినిస్, స్టార్క్.
