Champions Trophy :భారత్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు నిజమైన సవాల్‌

  • పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

ఈ నెల 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయ్ వేదికలలో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీలో భాగంగా భారత్‌, పాక్‌ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌ లో భారత్‌ను ఓడించడం పాకిస్థాన్‌ కు నిజమైన సవాలు అని అన్నారు. ”మా జట్టు చాలా బాగుంది. ఇటీవలి కాలంలో వారు బాగా రాణించారు. కానీ ఇప్పుడు వారి పని ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలవడమే కాకుండా దుబాయ్ లో జరగనున్న మ్యాచ్‌ లో మన చిరకాల ప్రత్యర్థి భారత్‌ను ఓడించడం. దేశం మొత్తం వారి వెనుక ఉంది” అని ప్రధాని షరీఫ్‌ అన్నారు.

➡️