దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సహా ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌కు టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కెప్టెన్సీగా ఎంపికయ్యాడు. భారత ఆటగాడు కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా, న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర, అఫ్ఘానిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జర్డాన్‌లకు ఈ టీమ్‌లో ఓపెనర్‌లుగా స్థానం కల్పించింది. వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ, సెకండ్ డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్ చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్, అఫ్ఘానిస్థాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్‌జారు, కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌లను మిడిల్ ఆర్డర్‌లో ఉండగా… బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, మ్యాట్ హెన్రీ, వరుణ్ చక్రవర్తిలకు చోటు కల్పించింది. భారత్‌కే చెందిన మరో బౌలర్ అక్షర్ పటేల్‌ను 12వ ఆటగాడిగా సెలెక్ట్ చేసింది. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లోని మొత్తం 12మంది ఆటగాళ్లలో ఆరుగురు ఇండియన్స్, నలుగురు కివీస్ ఆటగాళ్లు, ఇద్దరు అఫ్ఘానిస్థానీ ప్లేయర్స్ ఉన్నారు.
జట్టు : మిచెల్ శాంట్నర్ (కెప్టెన్) (న్యూజిలాండ్), రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్) ఇబ్రహీం జడ్రాన్ (అఫ్ఘానిస్థాన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్‌జారు (అఫ్ఘానిస్థాన్), మహ్మద్ షమీ(భారత్), మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్), వరుణ్ చక్రవర్తి(భారత్), అక్షర్ పటేల్(భారత్) 12వ ఆటగాడు.