LSG vs CSK : దూబే, ధోనీ.. ధనా ధన్‌

Apr 15,2025 00:14 #beat, #chennai, #five wickets, #Lucknow
  • లక్నోపై ఐదు వికెట్ల తేడాతో చెన్నై గెలుపు

లక్నో: ఈ సీజన్‌ ఐపిఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్‌(సిఎస్‌కె) రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై జట్టు చివరి 2ఓవర్లలో 24 పరుగులు చేయాల్సి వచ్చింది. లక్నో బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన ఓవర్లో ఏకంగా 19 పరుగులు రాబట్టి చెన్నై విజయాన్ని చేరువైంది. దీంతో చెన్నై మరో 3బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు రషీద్‌(27), రచిన్‌ రవీంద్ర(37)కి తోడు దూబే (43నాటౌట్‌), ధోనీ(26నాటౌట్‌) చెన్నై గెలుపులో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు తొలిగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 166పరుగులు చేసింది. లక్నో కెప్టెన్‌ పంత్‌ సూపర్‌ ఇన్నింగ్‌తో చెలరేగాడు. తొలుత ఓపెనర్‌ ఎడెన్‌ మర్క్‌రమ్‌(6) కొట్టిన బంతిని రాహుల్‌ త్రిపాఠి క్యాచ్‌ అందుకోవడంతో 6 పరుగులకే తొలి వికెట్‌ పడింది. ఆ తర్వాత డేంజరస్‌ నికోలస్‌ పూరన్‌(8)ను అన్షుల్‌ కంబోజ్‌ ఎల్బీగా వెనక్కి పంపాడు. అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడంతో రివ్యూ తీసుకొని మరీ వికెట్‌ సాధించింది చెన్నై. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌(63).. జేమీ ఓవర్టన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌తో సిక్సర్‌ సాధించాడు. దాంతో, లక్నో స్కోర్‌ 50 దాటింది. అయితే.. మార్ష్‌ను జడేజా బౌల్డ్‌ చేశాడు. ఆయుష్‌ బడోని ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. ఓవైపు నూర్‌ అహ్మద్‌.. డాట్‌ బాల్స్‌ వేస్తూ ఒత్తిడి పెంచారు. బౌండరీలు రావడం గగనమైన వేళ అతడు జడ్డూ బౌలింగ్‌లో ధోనీ స్టంపింగ్‌తో వెనుదిరిగాడు. ఒకదశలో లక్నో స్కోర్‌ 130 చేరడం కష్టమనిపించింది. 17వ ఓవర్‌ తర్వాత సీన్‌ మారిపోయింది. అబ్దుల్‌ సమద్‌(20) సిక్సర్‌ బాదాడు. దీంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

స్కోర్‌బోర్డు…
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (సి)త్రిపాఠి (బి)ఖలీల్‌ అహ్మద్‌ 6, మిఛెల్‌ మార్ష్‌ (బి)జడేజా 30, పూరన్‌ (ఎల్‌బి)కంబోజ్‌ 8, పంత్‌ (సి)ధోనీ (బి)పథీరణ 63, ఆయుష్‌ బడోనీ (స్టంప్‌)జడేజా 22, అబ్దుల్‌ సమద్‌ (రనౌట్‌)ధోనీ 20, డేవిడ్‌ మిల్లర్‌ (నాటౌట్‌) 0, శార్దూల్‌ ఠాకూర్‌ (సి) షేక్‌ రషీద్‌ (బి)పథీరణ 6, అదనం 11. (20ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 166పరుగులు. వికెట్ల పతనం: 1/6, 2/23, 3/73, 4/105, 5/158, 6/158, 7/166 బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-0-38-1, కంబోజ్‌ 3-0-20-1, ఓవర్టన్‌ 2-0-24-0, జడేజా 3-0-24-2, నూర్‌ అహ్మద్‌ 4-0-13-0, పథీరణ 4-0-45-2.

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రషీద్‌ (సి)పూరన్‌ (బి)ఆవేశ్‌ ఖాన్‌ 27, రచిన్‌ రవీంద్ర (ఎల్‌బి)మార్‌క్రమ్‌ 37, త్రిపాఠి (సి అండ్‌ బి)రవి బిష్ణోరు 9, జడేజా (సి)మార్‌క్రమ్‌ (బి)బిష్ణోయ్ 7, దూబే (నాటౌట్‌) 43, విజరు శంకర్‌ (సి)ఆవేశ్‌ ఖాన్‌ (బి)దిగ్వేష్‌ రాథి 9, ధోనీ (నాటౌట్‌) 26, అదనం 10. (19.3ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 168పరుగులు. వికెట్ల పతనం: 1/52, 2/74, 3/76, 4/96, 5/111 బౌలింగ్‌: శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-56-0, ఆకాశ్‌ దీప్‌ 1-0-13-0, దిగ్వేష్‌ సింగ్‌ 4-0-23-1, ఆవేశ్‌ ఖాన్‌ 3.3-0-32-1, రవి బిష్ణోరు 3-0-18-2, మార్‌క్రమ్‌ 4-0-25-1.

➡️