- రెండోటెస్ట్‌లో బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపు
కాన్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో చేజిక్కించుకొని క్లీన్‌స్వీప్ చేసింది. రెండో, చివరి టెస్ట్‌లో రోహిత్ సేన బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 95 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ జైస్వాల్(51) రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో కదం తొక్కాడు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(29నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 2వికెట్ల నష్టానికి 26పరుగులతో మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ జట్టు 146 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజాలు చెరో మూడేసి వికెట్లతో సత్తా చాటారు. జడేజా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి బంగ్లాదేశ్ నడ్డి విరిచాడు. ఇక అశ్విన్, బుమ్రా కూడా తమవంతు సహకారం అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండి యా 52పరుగుల ఆధిక్యత పోను భారత్ 95పరు గుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. ఆ లక్ష్యాన్ని టీమిండియా 17.2ఓవర్లలో రోహిత్(8), జైస్వాల్ (51), గిల్(6) వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్లేయ ర్ ఆఫ్ ది మ్యాచ్ జైస్వాల్, సిరీస్ అశ్విన్‌కు దక్కాయి.
డబ్ల్యుటిసి ఫైనల్ చేరువలో టీమిండియా..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) ఫైనల్‌కు చేరాలంటే టీమిండియా మరో మూడు టెస్ట్ మ్యాచుల్లో గెలవాల్సి ఉంది. ఈ ఫైనల్‌కు ముందు టీమిండియా ఎనిమిది టెస్టులు ఆడనుంది. ఇందులో మూడింట గెలిచినా ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్, నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (ఐదు టెస్టులు) ప్రారంభంకానున్నాయి. స్వదేశంలో కివీస్‌తో జరిగే సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేస్తే.. ఆస్ట్రేలియా సిరీస్‌తో సంబంధం లేకుండా డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరుతుంది. ఈ సిరీస్ గెలుపుతో భారత్(74.24)తో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా(62.50)తో 2వ స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక(55.56), ఇంగ్లండ్(42.19)తో 3, 4 స్థానాల్లో ఉన్నాయి.
స్కోర్‌బోర్డు…
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 233ఆలౌట్
ఇండియా తొలి ఇన్నింగ్స్: 285ఆలౌట్
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షాద్మన్ ఇస్లామ్ (సి)జైస్వాల్ (బి)ఆకాశ్ దీప్ 50, జాకిర్ హసన్ (ఎల్‌బి)అశ్విన్ 10, హసన్ మహ్మద్ (బి)అశ్విన్ 4, మోమినుల్ (సి)కెఎల్ రాహుల్ (బి)అశ్విన్ 2, శాంటో (బి)జడేజా 19, ముష్ఫికర్ రహీమ్ (బి)బుమ్రా 37, లింటన్ దాస్ (సి)పంత్ (బి)జడేజా 1, షకీబ్ (సి అండ్ బి)జడేజా 0, మెహిదీ హసన్ (సి)పంత్ (బి)బుమ్రా 9, తైజుల్ ఇస్లామ్ (ఎల్‌బి)బుమ్రా 0, ఖలీద్ అహ్మద్ (నాటౌట్) 5, అదనం 9. (47ఓవర్లలో ఆలౌట్) 146పరుగులు.
వికెట్ల పతనం: 1/18, 2/26, 3/36, 4/91, 5/93, 6/94, 7/94, 8/118, 9/130, 10/146
బౌలింగ్: బుమ్రా 10-5-17-3, అశ్విన్ 15-3-50-3, ఆకాశ్ దీప్ 8-3-20-1, సిరాజ్ 4-0-19-0, జడేజా 10-2-34-3.
ఇండియా రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి)హసన్ మహ్మద్ (బి)మెహిదీ హసన్ 8, జైస్వాల్ (సి)షకీబ్ (బి)తైజుల్ ఇస్లామ్ 51, శుభ్‌మన్ (ఎల్‌బి)మెహిదీ హసన్ 6, విరాట్ కోహ్లి (నాటౌట్) 29, పంత్ (నాటౌట్) 4. (17.2ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 98పరుగులు.
వికెట్ల పతనం: 1/18, 2/34, 3/92
బౌలింగ్: మెహిదీ 9-0-44-2, షకీబ్ 3-0-19-2, తైజుల్ 5.2-0-36-1.