భారీ వర్షం – ఐపిఎల్‌ మ్యాచ్‌ రద్దు

May 17,2024 08:34 #Sports

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-గుజరాత్‌ జెయింట్స్‌ జట్ల మధ్య ఉప్పల్‌ వేదికగా గురువారం జరగాల్సిన ఐపిఎల్‌ మ్యాచ్‌ భారీ వర్షం కారణంగా రద్దు అయ్యింది. కుండపోత వర్షం కారణంగా కనీసం టాస్‌ వేసే అవకాశం కూడా దక్కలేదు. అంపైర్లు రాత్రి 10గంటల వరకు మ్యాచ్‌ నిర్వహణకు వేచిచూసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మ్యాచ్‌ను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. ఇరుజట్లకు ఒక్కోపాయింట్‌ కేటాయించగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ప్లే-ఆఫ్‌ బెర్త్‌ను ఖాయం కానుంది.

➡️