కామన్వెల్త్‌ గేమ్స్‌ పేరు మార్పు

లండన్‌: ‘ది కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(సిజిఎప్‌)’ సోమవారం తన పేరును మార్చుకుంది. ‘కామన్‌వెల్త్‌ స్పోర్ట్‌’గా కొత్త పేరు పెట్టుకుంది. మార్చి 10న కామన్‌వెల్త్‌ డేను పురస్కరించుకుని ఈ పేరు మార్పు ప్రకటన చేసింది. అదేవిధంగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌ పరిపాలనా విభాగం పేరులో కూడా ‘ఫెడరేషన్‌’ అనే పదాన్ని తొలగించి ‘మూవ్‌మెంట్‌’ అనే పదాన్ని చేర్చారు. ‘స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ను స్పోర్ట్స్‌ మూవ్‌మెంట్‌’గా మార్చారు. ‘కామన్‌వెల్త్‌ స్పోర్ట్‌’ అనే బ్రాండ్‌ నేమ్‌ బలంగా ఉందని కామన్‌వెల్త్‌ స్పోర్ట్‌ సీఈవో కాటీ శాడ్లెయిర్‌ చెప్పారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అనేది ఇకపై కేవలం లీగల్‌ ఎంటిటీగా మాత్రమే ఉండనుందని అన్నారు. కాగా, 2026లో గ్లాస్గోలో జరగనున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు సంబంధించిన కింగ్స్‌ బాటన్‌ రిలేను కామన్‌వెల్త్‌ స్పోర్ట్‌ చీఫ్‌ అయిన కింగ్‌ చార్లెస్‌ ప్రారంభించారు. కామన్‌వెల్త్‌ డే సందర్భంగా బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో సోమవారం ఈ రిలే మొదలైంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఓపెనింగ్‌ సంబరాలకు 500 రోజుల ముందు కింగ్స్‌ బాటన్‌ రిలేను మొదలుపెట్టారు. ఈ కింగ్స్‌ బ్యాటన్‌ ప్రపంచంలోని 74 దేశాలు, ప్రదేశాల్లోని కామన్‌వెల్త్‌ గేమ్స్‌ అసోసియేషన్స్‌ చెంతకు చేరనుంది. ఒక్కో దేశంలో ఆరు రోజుల వరకు రిలే యాక్టివిటీస్‌ జరగనున్నాయి.

➡️