- ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ సత్తా చాటింది. ఆల్‌రౌండర్ల విభాగంలో 5వ ర్యాంక్‌లో నిలిచింది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌కు చెందిన అమేలియా కెర్ర్‌తో కలిసి సంయుక్తంగా దీప్తి 5వ ర్యాంక్‌లో నిలిచింది. 27ఏళ్ల దీప్తి శర్మ ఖాతాలో 344రేటింగ్ పాయింట్లు ఉండగా.. టాప్‌లో ఆస్ట్రేలియాకు చెందిన అస్ట్లే గార్డినర్ ఉన్నారు. శ్రీలంక లెజెండరీ ఆల్‌రౌండర్ ఛమీరి ఆటపట్టు రెండు స్థానాలు ఎగబాకింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 25పరుగులు చేయడంతో మూడు వికెట్లు పడగొట్టింది. సిరీజ్ 0-2తో కోల్పోయినా.. ఇక వన్డే మహిళా బ్యాటర్ల జాబితాలో స్మృతి మంధాన ఒక్కరే టాప్-10లో నిలిచారు. మంధాన వన్డే బ్యాటర్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది.