ముంబయి: భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియమించబడ్డాడు. అధ్యక్షుడు రోజర్ బిన్నీ తన ప్రత్యేక అధికారాలు వినియోగించి సైకియాను కార్యదర్శిగా ఎంపిక చేశాడు. సైకియా ప్రస్తుతం బిసిసిఐ జాయింట్ సెక్రెటరీగా కొనసాగుతున్నారు. అస్సాంకు చెందిన సైకియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. మాజీ కార్యదర్శి జై షా ఐసిసి అధ్యక్షునిగా ఎన్నిక కావడంతో సైకియా నియామకం అనివార్యమైంది. ఐసిసి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జై షా జోడు పదవులకు అనర్హుడు. దీంతో బిసిసిఐ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.