క్రీడలు : టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కారును వెనుక నుండి ట్రాలీ ఆటో ఢీకొట్టింది. కారుకు స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది. వెంటనే ద్రవిడ్ కారును పక్కకు ఆపి ఆటో డ్రైవర్‌తో వాదనకు దిగారు. ఈ ప్రమాదంలో ద్రవిడ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఆటో డ్రైవర్, ద్రవిడ్ ఇద్దరూ కన్నడ భాషలో మాట్లాడుకున్నారు. కారు స్వల్పంగా దెబ్బతినడంతో ఆ విషయమై డ్రైవర్‌పై ద్రవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిత్యం మైదానంలో శాంతంగా ఉండే ద్రవిడ్… ఆగ్రహానికి గురి కావడం చూసి అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఘటనా స్ధలం నుంచి బయలుదేరే ముందు ద్రవిడ్ సదరు ఆటో డ్రైవర్ వివరాలు తీసుకున్నారు. కానీ అతనిపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు.