Dubai – టీమిండియా లక్ష్యం 282 – పాక్‌ ఓపెనర్‌ భారీ శతకం

దుబాయ్ : అండర్‌-19 ఆసియాకప్‌లో భాగంగా … భారత్‌ తన మొదటి ఆటలో పాకిస్థాన్‌తో బరిలోకి దిగింది. ముందుగా టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఓపెనర్‌ షాజైబ్‌ ఖాన్‌ (159 ; 147 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స్‌లు) తో భారీ శతకంతో దూసుకుపోయాడు. మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ (60 ; 94 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ శతకం సాధించాడు. ఈ జోడీ తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. తర్వాత భారత బౌలర్లు చెలరేగిపోయి వరుసగా వికెట్లను పడగొట్టారు. మహ్మద్‌ రియాజుల్లా (27) పరుగులు చేశారు. హరూన్‌ అర్షద్‌ (3), ఫర్హాన్‌ యూసఫ్‌ (0), ఫహమ్‌-ఉల్‌-హక్‌ (4), సాద్‌ బేగ్‌ (4) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. భారత బౌలర్లలో సమర్థ్‌ నాగరాజ్‌ 3, ఆయుష్‌ మాత్రే 2 వికెట్లు.. కిరణ్‌, యుధజిత్‌ గుహ చెరో వికెట్‌ పడగొట్టారు.

➡️