టాస్‌ లేకుండానే దేశవాళీ సీజన్‌ – షెడ్యూల్‌ విడుదల చేసిన బిసిసిఐ

Jun 8,2024 08:57 #Sports
  • సెప్టెంబర్‌లో దులీప్‌ ట్రోఫీ

ముంబయి : భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) దేశవాళీ క్రికెట్‌ 2024-25 షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది నుంచి జరిగే దేశవాళీ సీజన్‌లో టాస్‌ వేయకుండానే మ్యాచ్‌లు జరగనున్నాయి. అదెలాగంటే.. టాస్‌ బదులు పర్యాటక జట్టుకు బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఎంచుకొనే అవకాశమిస్తారు. ఇది ఈ ఏడాది సికె నాయుడు ట్రోఫీ సరికొత్తగా ఉండనుంది. ఇక సెప్టెంబర్‌లో దులీప్‌ ట్రోఫీతో దేశవాళీ సీజన్‌ ఆరంభం కానుంది. అనంతపురం వేదికగా సెప్టెంబర్‌ 5న తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో పురుషుల సినీయర్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన నాలుగు జట్లు పాల్గననున్నాయి. అనంతరం వరుసగా ఇరానీ కప్‌, రంజీట్రోఫీలు నిర్వహించనున్నారు. అయితే.. ఈసారి రెండు విడతలుగా రంజీ పోటీలు జరిపేందుకు బిసిసిఐఐ నిర్ణయించింది. రెడ్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నీలు పూర్తవ్వగానే వైట్‌ బాల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. తొలుత సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ.. ఆ తర్వాత విజరు హజారే ట్రోఫీ ఉంటుంది. ఈ రెండు టోర్నీలు ముగిశాక రంజీట్రోఫీ రెండో విడతల్లో జరగనుంది. మ్యాచ్‌ ఏదైనా సరే టాస్‌ వేయడం పరిపాటి. కానీ, ఈసారి సీకే నాయుడు ట్రోఫీ సరికొత్త ఒరవడికి నాంది పలుకనుంది. ఈ టోర్నీలో ఇకపై టాస్‌ వేయకుండానే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

➡️