అఫ్గానిస్తాన్‌ బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా డ్వేన్‌ బ్రావో..

టీ20 వరల్డ్‌కప్‌-2024 కోసం ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ తమ జట్టు బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం డ్వేన్‌ బ్రావోను నియమించుకుంది.అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఇప్పటికే విండీస్‌కు చేరుకుంది. సెయింట్‌ కిట్స్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో ప్రాక్టీస్‌ చేయనున్నారు. బ్రావో కూడా అతి త్వరలోనే అఫ్గాన్‌ జట్టుతో కలవనున్నాడు. ఇక బ్రావో ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలింగ్‌ కోచ్‌ పనిచేస్తున్న విషయం తెలిసిందే. బ్రావో ఇప్పటివరకు టీ20ల్లో 625 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్‌ రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడంలోనూ బ్రావోది కీలక పాత్ర పోషించాడు.

➡️