ఫ్యామిలీ పాలసీపై వెనక్కి తగ్గేది లేదు

Mar 20,2025 00:32 #BCCI, #Cricket, #Sports, #sykia
  • బిసిసిఐ కార్యదర్శి దేవదత్‌ సైకియా

ముంబయి: భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు (బిసిసిఐ) ఫ్యామిలీ పాలసీలో మార్పులు లేవని కార్యదర్శి దేవ్‌దత్‌ సైకియా అన్నారు. ఈ నిర్ణయంపై గతంలో విరాట్‌ కోహ్లీ తన అసంతప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారత క్రీడాకారులు మ్యాచుల నిమిత్తం విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు వారి కుటుంబసభ్యులతో ఉండే సమయంలో బిసిసిఐ కోత విధించింది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భారతజట్టు ఆస్ట్రేలియా చేతిలో 1- 3 తేడాతో సిరీస్‌ ఓడిపోయిన తర్వాత బిసిసిఐ కొన్ని కఠిన నియమాలను అమల్లోకి తెచ్చింది. సమీప భవిష్యత్తులో వీటిలో ఎటువంటి మార్పులూ లేవని కార్యదర్శి సైకియా తాజాగా మరోసారి స్పష్టం చేశారు. ఐపిఎల్‌ అనంతరం జూన్‌, జులైలో టీమిండియా ఇంగ్లాండ్‌లో 5 టెస్టు మ్యాచులు ఆడనుంది. ఆ సిరీస్‌లోనూ ఇదే పాలసీ కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు.

➡️