IND vs ENG: ఐదో టీ20 అభిషేక్‌ శర్మ.. 178/3

Feb 2,2025 20:10 #Cricket, #Sports

వాంఖెడే స్టేడియంలో జరుగుతోన్న ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హాఫ్‌ సెంచరీ తర్వాత పేట్రేగిపోయిన అభిషేక్‌ శర్మ 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్‌ తరఫున ఇది రెండో వేగవంతమైన శతకం. టీ20ల్లో భారత్‌ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్‌ శర్మ పేరిట ఉంది. దూబే 11 బంతుల్లో 26 పరగులు మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 13 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 178 పరగులు చేసింది. అంతకు ముందు తిలక్‌ వర్మ 7 బంతుల్లో 16 పరుగులు, తిలక్‌ వర్మ 15 బంతుల్లో 24 పరుగులు చేసి పేవిలియన్‌కు చేరారు. కెప్టెన్‌ సూర్య 2 పరుగులు పేలవన ఫామ్‌ను కొనసాగించాడు.

➡️