హర్మన్‌ప్రీత్‌ సేనకు తొలి పరీక్ష

  • నేడు శ్రీలంకతో తొలి మ్యాచ్‌
  • మహిళల ట్రయాంగులర్‌ సిరిస్‌

కొలంబో: మహిళల ట్రయాంగులర్‌ సిరీస్‌లో భాగంగా భారతజట్టు తన తొలి లీగ్‌ మ్యాచ్‌ను శ్రీలంకతో తలపడనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారతజట్టు తన తొలి లీగ్‌ మ్యాచ్‌ను ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది. యువపేసర్‌ కశ్వీ గౌతమ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయనుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ట్రయాంగులర్‌ సిరీస్‌లో మూడో జట్టు దక్షిణాఫ్రికా. బ్యాటింగ్‌ విభాగంలో దుర్భేద్యఫామ్‌లో ఉన్న టీమిండియాకు ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా తొలి మ్యాచ్‌లో నెగ్గాల్సి ఉంది. లీగ్‌ దశలో ఒక్కో జట్టు మిగిలిన రెండు జట్లతో రెండేసిసార్లు తలపడనుంది. లీగ్‌ దశ ముగిసిన తర్వాత టాప్‌-2లో నిలిచి జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌లన్నీ ఉదయం 10.00గం||లకు ప్రారంభం కానున్నాయి.
జట్లు…
భారత్‌: హర్మన్‌(కెప్టెన్‌), హర్లిన్‌, రోడ్రిగ్స్‌, రావల్‌, మంధాన, తేజల్‌, అమన్‌జ్యోత్‌, దీప్తి, స్నేV్‌ా రాణా, రీచా ఘోష్‌, యాస్టికా భాటియా(వికెట్‌ కీపర్లు), అరుంధతి, కశ్వీ గౌతమ్‌, శ్రీచరణి.
శ్రీలంక: ఆటపట్టు(కెప్టెన్‌), కరుణరత్నే, హర్షిత, హాసిని, నన్నయకర, నీలాక్షిక, వి.గుణరత్నే, విహాంగ, కవీషా, పూమీ బడల్గే, రష్మిక, అనుష్క(వికెట్‌ కీపర్‌), కులసూరియ, రణవీర, ప్రియదర్శిని, మల్కి మదరా, సుగంధిక.
దక్షిణాఫ్రికా: వోల్వాడార్ట్‌(కెప్టెన్‌), లారా, తజ్మిన్‌, అమేరియా, ట్రయాన్‌, స్మిత్‌, క్లార్క్‌, షాంగోసే, లూస్‌, మెస్కో(వికెట్‌ కీపర్‌), జోఫ్ట్రా, ఖాకా, మాబా, శేషిని నాయుడు.

మహిళల ట్రయాంగులర్‌ సిరీస్‌ షెడ్యూల్‌…
27(ఆది) : భారత్‌ × శ్రీలంక
29(మంగళ): భారత్‌ × దక్షిణాఫ్రికా
01(గురు) : శ్రీలంక × దక్షిణాఫ్రికా
04(ఆది) : శ్రీలంక × భారత్‌
07(బుధ) : దక్షిణాఫ్రికా × భారత్‌
09(శుక్ర) : శ్రీలంక × దక్షిణాఫ్రికా
11(ఆది) : ఫైనల్‌

➡️