క్లబ్‌ల తరఫున ఆడనున్నట్లు ప్రకటించిన పోర్చుగల్ స్టార్
లిస్బన్(పోర్చుగల్): పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమాల్లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 41 ఏళ్ల రొనాల్డో పోర్చుగల్ తరఫున 234 మ్యాచుల్లో 146 గోల్స్ చేశాడు. గత నెలలో నేషన్స్ లీగ్ లో కోచ్ జార్జ్ జీసస్ రొనాల్డోను ఆడించకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. దాంతో ఈ స్టార్ ఆటగాడు జాతీయ జట్టు నుంచి వైదొలిగేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికినా క్లబ్ ఆటగాడిగా కొనసాగనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపాడు. జాతీయ జట్టుకు 7వ నంబర్ జెర్సీని తిరిగి ఇచ్చే సమయం వచ్చేసిందని, ఆ జెర్సీని ధరించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టేడియాలకు తనతోపాటు తీసుకువెళ్లే అదృష్టం, బాధ్యత తనకు దక్కిందని అన్నారు. కెరీర్ ఎదుగుదలకు సహకరించిన కుటుంబానికి, పోర్చుగీస్ ప్రజలకు, అలాగే జాతీయ జట్టులో తన 23 ఏళ్ల కెరీర్‌లో కలిసి పనిచేసిన సహచర ఆటగాళ్లకు, కోచ్‌లకు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్, అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘన రొనాల్డోదే. రొనాల్డోను మూడు యూఈఎఫ్‌ఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు, 4 యూరోపియన్ గోల్డెన్ షూ పురస్కారాలు వరించాయి. రొనాల్డో ఐదుసార్లు ఫిఫా అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. రొనాల్డో జట్టులోకి వచ్చిన తర్వాత ప్రపంచకప్‌లో పోర్చుగల్ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్‌కు వెళ్లడం. అది క్రిస్టియానో అరంగేట్రం చేసిన 2006 టోర్నీనే కావడం విశేషం.
పోర్చుగల్‌కు తొలి యూరో టైటిల్
పోర్చుగల్‌కు మొట్టమొదటి యూరోపియన్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అందించిన ఘనత కూడా రొనాల్డోదే. 2016 యూరో కప్‌ను అతడి సారథ్యంలో పోర్చుగల్ సొంతం చేసుకుంది. ఆ టోర్నీలో కెప్టెన్‌గా జట్టును నడిపించడమే కాకుండా ఫైనల్లో 3 కీలక గోల్స్ కూడా చేశాడు. ఆ తర్వాత 2019లో స్విట్జర్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి.. తొలి ఎడిషన్ నేషన్స్ లీగ్ కప్‌ను పోర్చుగల్ గెలవడంలో రొనాల్డో కీలక పాత్ర పోషించాడు. 2025లో స్పెయిన్‌తో జరిగిన ఫైనల్లో గోల్ కొట్టి, పోర్చుగల్‌కు రెండోసారి నేషన్స్ లీగ్ టైటిల్‌ను అందించాడు.
నెరవేరని కల
క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలు సాధించినప్పటికి.. ఫిఫా ప్రపంచకప్ టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రొనాల్డో తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఫిఫా ప్రపంచకప్‌ను గెలవలేదు. పోర్చుగల్ తరఫున 6 ప్రపంచకప్‌లు ఆడిన రొనాల్డో.. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయాడు. ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో పోర్చుగల్ ఓడిపోవడంతో రొనాల్డో ఆఖరి వరల్డ్ కప్ ప్రయాణం ముగిసినట్లు అప్పుడే ప్రకటించాడు.








కామెంట్‌లు (0)