ఐసిసి : ఐసిసి పురుషుల క్రికెట్ కమిటీకి భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ మళ్లీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. దుబాయ్ లో జరిగిన ఐసిసి వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 2021లో అనిల్ కుంబ్లే స్థానంలో బాధ్యతలు స్వీకరించిన గంగూలీ, మరోసారి అదే పదవిలో కొనసాగనున్నారు. ఈ కమిటీలో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సభ్యుడిగా కొనసాగనున్నాడు. ఇతర సభ్యులుగా వెస్టిండీస్‌కు చెందిన డెస్మండ్ హేన్స్, అఫ్గానిస్థాన్‌కు చెందిన హమిద్ హసన్, దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జనాథన్ ట్రాట్ ఉన్నారు. ఇదిలా ఉండగా … మహిళల క్రికెట్ కమిటీలో న్యూజిలాండ్‌కు చెందిన కేథరిన్ క్యాంప్‌బెల్ అధ్యక్షత వహిస్తుండగా, ఆస్ట్రేలియాకు చెందిన అవ్రిల్ ఫహే, దక్షిణాఫ్రికాకు చెందిన మొసెకి సభ్యులుగా ఉన్నారు.
