ICC ODI rankings టాప్‌లోనే శుభ్‌మన్‌

Mar 12,2025 22:57 #Cricket, #icc rankings, #Sports
  • రోహిత్‌ ర్యాంక్‌ మెరుగు శ్రీ ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ సత్తా చాటారు. శుభ్‌మన్‌ గిల్‌(784రేటింగ్‌ పాయింట్లు) తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో అర్ధసెంచరీతో మెరిసిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడో స్థానానికి ఎగబాకాడు. రోహిత్‌ ఖాతాలో 756రేటింగ్‌ పాయింట్లు ఉండగా.. కోహ్లి(736) 5వ, శ్రేయస్‌ అయ్యర్‌(704) 8వ స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో టాప్‌-10లో భారత్‌నుంచి ఏకంగా నలుగురు బ్యాటర్లు చోటు దక్కించుకోవడం విశేషం. ఈ క్రమంలోనే టాప్‌-5లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉండడం మరో విశేషం. ఇక పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(770) రెండోస్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్లలో టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా సైతం తమ తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నాడు. కుల్దీప్‌ యాదవ్‌(650పాయింట్లు) రెండుస్థానాలు మెరుగుపరుచుకొని మూడోస్థానానికి చేరుకున్నాడు. రవీంద్ర జడేజా(616) సైతం మూడుస్థానాలు మెరుగుపరుచుకొని పదో స్థానంలో నిలిచాడు.

➡️