- డిస్కస్ త్రోలో యోగేశ్‌కు రజతం
- బ్యాడ్మింటన్‌లో మనీషాకు కాంస్యం
- అథ్లెటిక్స్‌లో ప్రీతికి మరో పతకం
పారిస్: పారా ఒలింపిక్స్‌లో నాల్గోరోజు భారత్ ఖాతాలో మరికొన్ని పతకాలు దక్కాయి. బ్యాడ్మింటన్, డిస్కస్ త్రో, అథ్లెటిక్స్ విభాగాల్లో సోమవారం భారత్‌కు ఈ పతకాలు దక్కాయి. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ స్వర్ణ పతక పోటీలో నితీశ్ కుమార్ పసిడి పతకం కొల్లగొట్టాడు. సోమవారం జరిగిన ఫైనల్లో నితీశ్ 21-14, 18-21, 23-21తో బ్రిటన్‌కు చెందిన డానియల్ బెథెల్‌ను మూడు సెట్లలో ఓడించి స్వర్ణ పతకం సాధించాడు. పారిస్‌లో పతకమే లక్ష్యంగా పెట్టుకున్న నితీశ్ చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో డానియల్ బెథెల్‌ను మట్టికరిపించాడు. తొలి సెట్‌ను 21-14తో అలవోకగా గెలుపొందిన నితీశ్ రెండో సెట్ కోల్పోయాడు. అయితే.. నిర్ణయాత్మక మూడో సెట్‌లో పంజా విసిరిన భారత షట్లర్ ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు. డానియల్ కూడా ఏమాత్రం తగ్గలేదు. అయితే.. చివరకు 23-21తో నితీశ్ గెలుపొందాడు. పారాలింపిక్స్‌లో భారత డిస్కస్ త్రోయర్ యోగేశ్ కథునియా రజతంతో మెరిశాడు. సోమవారం జరిగిన ఫైనల్లో 22 ఏండ్ల ఈ అథ్లెట్.. డిస్కస్‌ను తొలి ప్రయత్నంలోనే డిస్సస్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. ఈ పోటీల్లో బ్రెజిల్‌కు చెందిన క్లాడినె బతిస్తా హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించాడు. పారిస్‌లో క్లాడినె డిస్కస్‌ను 46.86 మీటర్ల దూరం విసిరి స్వర్ణం కొల్లగొట్టాడు.
డిస్కస్ త్రోలో యోగేశ్‌కు రజతం
పారాలింపిక్స్‌లో భారత్ మరో రజత పతకం సాధించింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56లో యోగేశ్ కతునియా (42.22 మీటర్లు) రజతం దక్కించుకున్నాడు. బ్రెజిల్‌కు చెందిన క్లాడినీ బాటిస్టా (46.86 మీ) స్వర్ణం అందుకున్నాడు. గ్రీస్ దేశానికి చెందిన కాన్స్టాంటినోస్ జౌనిస్ (41.32 మీ) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. తాజాగా యోగేశ్ పతకం గెలవడంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. యోగేశ్‌కు పారాలింపిక్స్‌లో ఇది రెండో పతకం. టోక్యోలోనూ అతడు రజతం సాధించాడు.
మరోవైపు.. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌హెచ్6 కాంస్య పతక పోరులో శివరాజన్- నిత్యశ్రీ నిరాశపర్చారు. 17-21, 12-21తో ఇండోనేషియా జోడీ సుభాన్-రినా మార్లినా చేతిలో ఓటమి చవిచూశారు.
ప్రీతి డబుల్ ధమాకా
పారాలింపిక్స్‌లో రెండ్రోజుల క్రితమే కాంస్యంతో మెరిసిన పారా అథ్లెట్ ప్రీతి పాల్ ఆదివారం మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 200మీ. రేసులోనూ ఆమె కాంస్య పతకం సాధించింది. రెండ్రోజుల వ్యవధిలో అథ్లెటిక్స్ విభాగంలో రెండు పతకాలు కొల్లగొట్టిన తొలి పారా అథ్లెట్‌గా ఆమె ఈ ఘనత సాధించింది. ఆదివారం జరిగిన మహిళల 200 మీటర్ల (టీ35) రేసును 30.01 సెకన్లలోనే పూర్తిచేసి వరుసగా రెండో కాంస్యాన్ని సొంతం చేసుకుంది. చైనా అమ్మాయిలు జియా ఝూ (28.15), క్వియాన్‌కిన్ (29.09) వరుసగా స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నారు. ప్రీతి తటిలో అగ్రస్థానంలో నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ పతకం నెగ్గడం ద్వారా భారత్ నుంచి పారాలింపిక్స్ ఒకే ఎడిషన్‌లో రెండు మెడల్స్ గెలిచిన మూడో పారా క్రీడాకారిణిగా ప్రీతి రికార్డులకెక్కింది. అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో షూటర్ అవని లేఖరా, మరో షఉటర్ సింగ్‌రాజ్ అధన ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించారు.
కాంస్య పోరులో ఓడిన రాకేశ్
ఆర్చరీ పురుషుల వ్యక్తిగత కాంపౌండ్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కాంస్య పోరుకు అర్హత సాధించిన రాకేశ్ తటిలో పతకాన్ని కోల్పోయాడు. కాంస్య పోరులో అతడు 146-147తో హి జిహావో చేతిలో ఓటమిపాలయ్యాడు. ఒక్క పాయింట్ తేడాతో రాకేశ్ కాంస్యం చేజార్చుకోవడం గమనార్హం. అంతకుముందు సెమీస్‌లో రాకేశ్ 143-145తో జిన్లియాంగ్ (చైనా) చేతిలో ఓడి కాంస్య పోరుకు అర్హత సాధించాడు.
షూటింగ్‌లో నిరాశ
రెండు రోజుల్లోనే దేశానికి నాలుగు పతకాలు అందించిన షఉటర్లు ఆదివారం మాత్రం నిరాశపరిచారు. పారిస్‌లో ఇదివరకే పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో స్వర్ణం నెగ్గిన అవని లేఖరా ఆదివారం జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్1) మిక్స్‌డ్ ఈవెంట్ క్వాలిఫికేషన్‌లో 11వ స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్ మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్2)లో శ్రీహర్ష రామకష్ణ 26వ స్థానంలో నిలిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్స్‌లో టాప్8 లో నిలిచినవారే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.
బ్యాడ్మింటన్‌లో మూడు పతకాలు పక్కా: పురుషుల సింగిల్స్ (ఎస్‌ఎల్3) సెమీస్‌లో కుమార్ నితేశ్.. 21-16, 21-16తో ఫుజిహర (జపాన్)ను ఓడించి ఫైనల్స్‌కు చేరాడు. మరో ఈవెంట్ పురుషుల సింగిల్స్ (ఎస్‌ఎల్4) సెమీస్‌లో సుహాస్ యతిరాజ్ 21-17, 21-12తో భారత్‌కే చెందిన సుకాంత్ కదమ్‌ను ఓడించి గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు అర్హత సాధించాడు. ఈ ఇద్దరూ ఫైనల్స్‌లో గెలిస్తే దేశానికి రెండు స్వర్ణాలు అందించే అవకాశం ఉండగా ఓడినా కనీసం రజతాలు అయితే భారత్ ఖాతాలో చేరనున్నాయి.
మహిళల విభాగాల్లోనూ భారత్‌కు పతకం దక్కే విజయాలే నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ (ఎస్‌యూ5) క్వార్టర్స్ పోరులో మనీష రామదాస్ 21-13, 21-16తో మమికొ టొయొడ (జపాన్)ను ఓడించి సెమీస్ పోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో ఆమె భారత్‌కే చెందిన తులసిమతి మురుగేశన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ పోరులో గెలిచిన విజేత ఫైనల్స్‌కు చేరనుండగా ఓడినవాళ్లు కాంస్య పోరులో ఆడతారు. మహిళల సింగిల్స్ (ఎస్‌హెచ్6) క్వార్టర్స్‌లో నిత్య శ్రీ సివన్ 21-4, 21-7తో ఒలివియా (పోలండ్)ను ఓడించి సెమీస్‌కు చేరింది.