టి20లకు మహ్మదుల్లా గుడ్‌బై

  • ఇండియాతో సిరీస్‌ చివరిదంటూ ప్రకటన

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌, సినీయర్‌ బ్యాటర్‌ మహ్మదుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టి20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు మంగళవారం ప్రకటించాడు. భారత్‌తో జరిగే మూడు టి20ల సిరీస్‌ అనంతరం ఈ ఫార్మాట్‌నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. 38ఏళ్ల మహ్మదుల్లా 2007లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌తో టి20ల్లో అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌ తరఫున షకీబ్‌-అల్‌ హసన్‌ తర్వాత సీనియర్‌ క్రికెటర్‌ మహ్మదుల్లా మాత్రమే. ఈ ఫార్మాట్‌లో సుమారు 17ఏళ్ల 35రోజుల పాటు కొనసాగిన మహ్మదుల్లా యువ క్రికెటర్లకు అవకాశమివ్వాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. బంగ్లాదేశ్‌ తరఫున 139 టి20ల్లో 117.74 స్ట్రయిక్‌రేట్‌తో 2,395పరుగులు చేశాడు.

➡️