ఆస్ట్రేలియా మహిళల ఘన విజయం

షార్జా వేదికగా మంగళవారం జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు 60పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 148పరుగులు చేసింది. మూనీ(40), పెర్రీ(30) బ్యాటింగ్‌లో రాణించారు. ఛేదనలో న్యూజిలాండ్‌ మహిళలు 19.2ఓవర్లలో 88పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఆసీస్‌ బౌలర్‌ స్కట్‌(3/3)కి తోడు సథర్లాండ్‌(3/21), మోలినెక్స్‌(2/15) మెరిసారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మేఘన్‌ స్కట్‌కు దక్కింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా జట్టు సెమీస్‌కు చేరువైంది.

➡️