గుజరాత్‌కు ఊరట

Mar 7,2024 07:46 #Cricket, #Gujarat, #Women
gujarat win in women premier league
  •  వరుసగా నాలుగు ఓటములకు బ్రేక్‌ 
  • బెంగళూరుపై 19పరుగుల తేడాతో గెలుపు 
  • లారా, మూనీ మెరుపు ఇన్నింగ్స్‌
  • ఉమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌)

న్యూఢిల్లీ: ఉమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) గుజరాత్‌ జెయింట్స్‌కు ఊరట లభించింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి నిరాశలో ఉన్న గుజరాత్‌కు ఈ సీజన్‌లో తొలి గెలుపు లభించింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళలపై ఆ జట్టు 19 పరుగుల తేడాతో గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు లారా(76), మూనీ(85నాటౌట్‌) రాణించడంతో 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 199పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో గుజరాత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు కోల్పోయి 180పరుగులే చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు లారా, మూనీ అదిరే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు వీరు 13ఓవర్లలో 140పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బెత్‌ మూనీ (51 బంతుల్లో 85 నాటౌట్‌, 12 ఫోర్లు, 1 సిక్సర్‌), లారా వోల్వార్డ్ట్‌ (45 బంతుల్లో 76, 13 ఫోర్లు) చెలరేగి ఆడారు. డబ్ల్యూపిఎల్‌లో ఏ వికెట్‌కు అయినా ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. గత సీజన్‌లో ఢిల్లీ ఓపెనర్లు షఫాలీ వర్మ-మెగ్‌ లానింగ్‌లు ఇదే ఆర్సీబీతో మ్యాచ్‌లో 162 పరుగులు జోడించారు. తాజాగా లారా-మూనీలు 140 పరుగులు జతచేశారు. ఆ తర్వాత ధాటిగా ఆడే క్రమంలో బెంగళూరు జట్టు వరుసగా వికెట్లను కోల్పోయి 199పరుగులు చేసింది. ఛేదనలో బెంగళూరు జట్టులో వారేహామ్‌(48), రీచా(30), మంధాన(24), పెర్రి(24), సోఫి డివైన్‌(23) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. చివర్లో లక్ష్యం భారీగా పెరిగిపోవడంతో 8వికెట్ల నష్టానికి 180పరుగులే చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బెత్‌ మూనీకి లభించింది.

  • స్కోర్‌బోర్డు..

గుజరాత్‌ జెయింట్స్‌ మహిళల ఇన్నింగ్స్‌:

లారా (రనౌట్‌) ఏక్తా బిస్త్‌/రీచా ఘోష్‌ 76, మూనీ (నాటౌట్‌) 85, లిచ్‌ఫీల్డ్‌ (రనౌట్‌) మంధాన/రీచా 18, గార్డినర్‌ (సి)సిమ్రన్‌ (బి)వారేహామ్‌ 0, హేమలత (స్టంప్‌) రీచా (బి)మోలినెక్స్‌ 1, వేదా కృష్ణమూర్తి (రనౌట్‌) ఏక్తా బిస్ట్‌/రీచా ఘోఓష్‌ 1, బ్రైస్‌ (నాటౌట్‌) 1, అదనం 17. (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 199పరుగులు.

వికెట్ల పతనం: 1/140, 2/192, 3/192, 4/195, 5/198

బౌలింగ్‌: సోఫీ డివైన్‌ 3-0-37-0, రేణుక 4-0-34-0, మోలినెక్స్‌ 4-0-32-1, వారేహామ్‌ 4-0-36-1, ఏక్తా బిస్ట్‌ 3-0-31-0, శోభన 1-0-11-0, ఎలీసా పెర్రి 1-0-15-0.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల ఇన్నింగ్స్‌: మేఘన (రనౌట్‌) లారా/మూనీ 4, మంధాన (ఎల్‌బి)గార్డినర్‌ 24, ఎలీసె పెర్రి (సి)మూనీ (బి)బ్రైస్‌ 24, సోఫి డివైన్‌ (బి)తనూజ 23, రీచా ఘోష్‌ (సి)మేఘన (బి)గార్డినర్‌ 30, వారేహామ్‌ (రనౌట్‌) లారా/మేఘన 48, మోలినెక్స్‌ (రనౌట్‌) లిచ్‌ఫీల్డ్‌/మేఘన 3, సిమ్రన్‌ (నాటౌట్‌) 1, ఏక్తా బిస్ట్‌ (నాటౌట్‌) 12, అదనం 11. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 180పరుగులు.

వికెట్ల పతనం: 1/31, 2/42, 3/76, 4/96, 5/129, 6/163, 7/167, 8/180 బౌలింగ్‌: గార్డినర్‌ 4-0-23-2, బ్రైస్‌ 4-0-26-1, తనూజ 4-0-43-1, మేఘన 4-0- 42-0, మన్నత్‌ 1-0-10-0, శబ్నమ్‌ 3-0-27-0

➡️